తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు డా. నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి 30వ వర్ధంతి సందర్భంగా రేపు (18-01-2026) ఉదయం 10 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నివాళులర్పణ కార్యక్రమం జరగనుంది.
ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

