rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 09 January 2026, 9:21 am Digital Edition : RAKSHANA DAILY DESK

ఇంటింటికి  కుళాయి…

మాచర్ల, శుక్రవారం (9-1-2026)
“గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో మాచర్ల రూపురేఖలు మారిపోతున్నాయి. శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి నిరంతర కృషితో, మా నియోజకవర్గం అభివృద్ధి పథంలో వేగంగా దూసుకెళుతోంది,” అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షులు కొమెర దుర్గారావు తెలిపారు.
అమృత జలజీవనం పథకం కింద ₹124 కోట్లతో మాచర్ల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి నీటి కులాయి అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అని ఆయన చెప్పారు. తాగునీటి సమస్యకు ఇది శాశ్వత పరిష్కారమవుతుందని, ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయని పేర్కొన్నారు.
ప్రతి కుటుంబానికి శుద్ధమైన నీరు అందించడం తమ ముఖ్య లక్ష్యమని, ప్రజల అభివృద్ధి కోసం MLA జూలకంటి బ్రహ్మానంద రెడ్డి శ్రమిస్తున్నారని దుర్గారావు అన్నారు.
“మాచర్ల అభివృద్ధి ఇంకా వేగంగా జరుగుతుందనం విశ్వాసం ఉంది,” అని కొమెర దుర్గారావు గారు తెలిపారు.