rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 6:19 am Digital Edition : RAKSHANA DAILY DESK

అదిరిపోయాలా…

గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలి –

జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా

గణతంత్ర వేడుకలకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. 77వ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు తుళ్లూరు మండలం రాయిపూడిలో జరుగుతున్నాయని తెలిపారు. ఆయా శాఖల అభివృద్ధిని ప్రతిబింబించే శకటాలు ఏర్పాటు చేయాలని, తాగునీరు, పారిశుధ్యం పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజా వలి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.