rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 12:28 pm Digital Edition : RAKSHANA DAILY DESK

అత్యంత వైభవంగా

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పి.ఎ.సి చైర్మన్ శ్రీ అరేకపూడి గాంధీ గారు 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారితో కలిసి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేజ్–2, మహంకాళి నగర్ చౌరస్తాలో ఉన్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జెండావందనం చేశారు.
ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వీరులను స్మరించుకుంటూ, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని నాయకులు వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, కాలనీ వెల్‌ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.